: విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఎక్కడా దాడి చేయలేదు.. ఎన్ కౌంటర్ చేయాల్సిన అవసరమేమిటి?: వరవరరావు


ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ పై విరసం నేత వరవరరావు స్పందిస్తూ, ఇదంతా బూటకమని, మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి కాల్పులకు పాల్పడ్డారని, ఎదురు కాల్పుల్లో మావోలు మృతి చెందారనడం సరికాదని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో మావోలు ఎక్కడా దాడి చేయలేదన్నారు. అలాంటప్పుడు ఎన్ కౌంటర్ చేయాల్సిన అవసరమేమిటని ఆయన ప్రశ్నించారు. ఎన్ కౌంటర్ ను హత్యా నేరంగా నమోదు చేసి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని వరవరరావు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News