: చంద్రబాబును కలిసిన ‘సోలార్ జిస్’ ప్రతినిధులు
ఏపీ సీఎం చంద్రబాబును సోలార్ జిస్ ఇండియా సంస్థ ప్రతినిధులు కలిశారు. అనంతపురం జిల్లాలో సోలార్ పార్క్, కర్నూల్ లో సోలార్ సెల్స్ తయారీకి సదరు సంస్థ ముందుకొచ్చింది. అనంతపురంలో సోలార్ పార్క్ ఏర్పాటు నిమిత్తం భూమి కేటాయిస్తే కనుక రూ.15 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు చంద్రబాబుకు తెలిపారు. సోలార్ పార్క్ ఏర్పాటు ద్వారా సుమారు 14 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు సమాచారం.