: సీనియర్ కమాండో అబూబకర్ కుటుంబానికి రూ.40 లక్షల ఎక్స్ గ్రేషియా
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో ఈరోజు జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సీనియర్ కమాండో అబూబకర్ కుటుంబానికి రూ.40 లక్షలు ఎక్స్ గ్రేషియాగా ప్రకటించారు. ఏపీ డీజీపీ సాంబశివరావు విశాఖపట్టణంలోని గాజువాకలోని అబూ బకర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, ఈ ఎన్ కౌంటర్ లో గాయపడిన మరో సీనియర్ కమాండర్ సతీష్ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.