: ‘నా పుట్టినరోజు వేడుకలు జరపకండి’.. అభిమానులను కోరిన కమల్‌హాసన్
నెల రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా తన పుట్టినరోజు వేడుకను జరుపుకోకూడదని సినీనటుడు కమల్‌హాసన్ నిర్ణయించుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. వచ్చేనెల 7న తన పుట్టినరోజు వేడుకలను జరపకూడదని అభిమానులను కోరారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ‘శభాష్ నాయుడు’ మూవీ చిత్రీకరణలో ఆయన పాల్గొంటున్నారు.