: సూపర్ మోడల్ మిరాండాను పెళ్లాడబోతున్న స్నాప్ చాట్ యజమాని
సూపర్ మోడల్ మిరాండా కెర్ర్ (33)ను ప్రముఖ ఇమేజ్ మెసేజింగ్ సంస్థ 'స్నాప్ చాట్' యజమాని ఇవాన్ స్పీగెల్ పెళ్లాడబోతున్నారు. వీరి వివాహం వచ్చే ఏడాది జరగనుంది. తమ వివాహానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని మిరాండా తెలిపింది. ఏడాది పాటు డేటింగ్ చేసిన తర్వాత మిరాండా, ఇవాన్ లు గత జూన్ లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే, మిరాండాకు ఇప్పటికే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. తన మాజీ భర్త ఓర్లాండో బ్లూమ్ ద్వారా ఆమెకు ఇతను జన్మించాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ఇవాన్ తనను ప్రపోజ్ చేసినప్పుడు ఎంతో ఉద్వేగానికి గురయ్యానని... అతని నుంచి ఈ ప్రపోజల్ ను ఎక్స్ పెక్ట్ చేయలేదని మిరాండా తెలిపింది. ఎంతో సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నానని చెప్పింది.