: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు


కడప జిల్లా ఇడుపులపాయలో ఈ రోజు ఓ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను అనంతపురం జిల్లా ఎన్.పీ.కుంటకు చెందిన అమ్మాయిగా గుర్తించారు. ఉద‌యం నీళ్లలో విషం కలుపుకుని తాగి ఆమె ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది. అయితే కొద్ది సేపటికి తోటి విద్యార్థులు ఈ విష‌యాన్ని గమనించి, వెంట‌నే కళాశాల యాజమాన్యానికి తెలప‌డంతో విద్యార్థినిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. చదువులో అధికంగా ఒత్తిడికి గురికావ‌డం వ‌ల్లే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆసుప‌త్రిలో ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

  • Loading...

More Telugu News