: అధికారంలో ఉన్నప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారు: హరీశ్ రావు


కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై తెలంగాణ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... అధికారంలో ఉన్నపుడు ఆంధ్రాలో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి పులిచింతల కట్టించార‌ని, మ‌రోవైపు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను అడ్డుకున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల హక్కుల గురించి అడిగే అర్హ‌త ఆ పార్టీ నేతలకు లేదని వ్యాఖ్యానించారు. డిండి ప్రాజెక్టు కోసం ఇప్ప‌టికే టెండ‌ర్లు పిలిచామని ఆయ‌న చెప్పారు. ఫ్లోరైడ్ నిర్మూలన కోసం ఆ ప్రాజెక్టు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసమే త‌మ స‌ర్కారు కృషి చేస్తోంద‌ని హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బిడ్డ అని ఆయ‌న అన్నారు. రైతుల కష్టాలు కేసీఆర్‌కు తెలుసని చెప్పారు. వారి కోస‌మే కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. త‌మ స‌ర్కారుపై ప్ర‌జ‌లు చూపిస్తోన్న ప్రేమ‌ను చూడ‌లేకే ప్రతిపక్షాలు త‌మ‌పై అర్థంపర్థంలేని విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. చెరువులు నిండి నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. వెయ్యి కోట్ల రూపాయ‌ల‌తో ప్రతి మండలానికో గోదాం నిర్మిస్తున్నామని ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News