: మ‌ణిపూర్ ముఖ్యమంత్రిపై కాల్పులు.. తృటిలో త‌ప్పించుకున్న ఇబోబీసింగ్‌


మ‌ణిపూర్ ముఖ్య‌మంత్రి ఒక్రాం ఇబోబీసింగ్‌పై ఎన్ఎస్‌సీఎల్ కార్య‌క‌ర్త‌లు ఈ రోజు కాల్పులు జ‌రిపారు. కాల్పుల నుంచి ఆయ‌న‌ తృటిలో త‌ప్పించుకున్నారు. ఆ రాష్ట్ర రాజ‌ధాని ఇంపాల్‌కు 84 కిలోమీట‌ర్ల దూరంలోని ఉక్రుల్ ద‌గ్గ‌ర ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో నిర్మించిన ఆసుప‌త్రితో పాటు ప‌లు భ‌వ‌నాల ప్రారంభోత్స‌వానికి ఆయ‌న వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న జరిగింది. ఈ ఘ‌ట‌న‌తో ఉక్రుల్ ప్రాంతంలో హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. కాల్పులు జరిగిన సమయంలో ఇబోబీసింగ్‌ వెంట ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గైకాంగామ్ కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మణిపూర్ రైఫిల్స్ జవాన్లకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో వెంటనే ముఖ్యమంత్రిని ఆ ప్రాంతం నుంచి ఇంపాల్ కు తరలించారు.

  • Loading...

More Telugu News