: భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చిన సామ్‌సంగ్‌


ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ సామ్ సంగ్ నుంచి 'గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌' పేరుతో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ భార‌త‌ మార్కెట్లోకి విడుదలైంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధ‌ర 18,490 రూపాయ‌లుగా ఉంది. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్ ఫోనులో ఆండ్రాయిడ్‌ ఓఎస్‌, 5.50 అంగుళాల స్క్రీను, 1.6 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 3 జీబీ అంత‌ర్గ‌త మెమొరి, 8 మెగాపిక్సెల్ ఫ్రెంట్, 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 జీబీ స్టోరేజితో ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. బ్యాటరీ సామర్థ్యం 3300 ఏఎంహెచ్‌గా ఉంది.

  • Loading...

More Telugu News