: ఏటీఎం కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తికి కార్డు ఇచ్చి రూ.40 వేలు పోగొట్టుకున్న వ్యక్తి


విశాఖప‌ట్నంలోని పరవాడ మండలం పెదముషిడివాడ ప్రాంతంలో ఏటీఎం కేంద్రంలో ఓ వ్య‌క్తి మోస‌పోయాడు. డ‌బ్బులు డ్రా చెయ్య‌డానికి పి.అప్పారావు అనే వ్య‌క్తి లంకెలపాలెం ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో త‌న కార్డును అక్క‌డే ఉన్న ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తికి ఇచ్చాడు. తాను ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వ్వ‌డంతో అప్పారావు డబ్బు తీసిపెట్టమని అతనికి ఇచ్చాడు. అప్పారావుకి స‌దరు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి రూ.40వేలు డ్రా చేసి ఇచ్చాడు. అయితే, అనంతరం అప్పారావుకి మరో ఏటీఎం కార్డు ఇచ్చాడు. దీన్ని గమనించకుండా అప్పారావు త‌న‌కిచ్చిన ఏటీఎం కార్డు త‌నదే అనుకొని అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. త‌రువాత‌ ఆ గుర్తుతెలియని వ్యక్తి మరో రూ.40 వేలను అప్పారావు ఖాతా నుంచి ఓ ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. త‌న‌ ఖాతా నుంచి రూ.40 వేలు డ్రా అయినట్లుగా బ్యాంకు నుంచి వ‌చ్చిన ఎస్ఎమ్ఎస్ తో అప్పారావు ఆందోళన చెంది, పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News