: రూపాయికే అన్‌లిమిటెడ్ 4జీ డేటా.. ఐడియా సంచలన ఆఫర్.. ఎలా పొందాలంటే..!
రిలయన్స్ జియో దెబ్బతో వణికిపోతున్న ఇతర టెలికం సంస్థలు తమ వినియోగదారులను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. డేటా చార్జీలను తగ్గిస్తూ జియో వైపు చూడకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. వినియోగదారులను ఆఫర్ల మత్తులో జోకొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా టెలికం దిగ్గజ సంస్థ ఐడియా రూపాయికే అన్‌లిమిటెడ్ 4జీ డేటా ఇస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. దీనిని ఎలా పొందాలంటే.. వినియోగదారుడి వద్ద తొలుత ఐడియా 4జీ సిమ్‌తోపాటు 4జీ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. దీంతోపాటు అకౌంట్‌లో రూపాయి బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలి. తర్వాత 411కు కాల్ చేసి వచ్చే సూచనలకు అనుగుణంగా ఫాలో కావాలి. ఆఫర్ యాక్టివేట్ అయిన తర్వాత కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. దీంతో ఆఫర్ యాక్టివేట్ అయినట్టే. ఎంచక్కా డేటాను వాడేసుకోవచ్చు. అయితే ఇక్కడో చిక్కు ఉంది. అన్‌లిమిటెడ్ డేటాను కేవలం గంటపాటు మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. తర్వాత డేటా పనిచేయదు. ఈ గంట సమయంలో 4జీబీ నుంచి 5జీబీ వరకు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్త ప్యాక్ యాక్టివేట్ అయిన వెంటనే పాత డేటా ప్యాక్ ఆగిపోతుంది. ఒకే నంబరు నుంచి మూడుసార్లు అన్‌లిమిటెడ్ ఆఫర్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.