: అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు ఎన్నారైలు మృతి


అమెరికాలో నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు ఎన్నారైలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన లూయిస్ విల్లేలో చేటు చేసుకుంది. రాత్రి పది గంటల ప్రాంతంలో రామ వరాహభట్ల, రాజశేఖర్ యర్మాల, వెంకట ప్రశాంత్ కొమ్ము, అన్వేష్ కుమార్ లు లూయిస్ విల్లేలోని నార్త్ బెండ్ రోడ్డు మీద కారులో వెళుతున్నారు. అయితే, కారు నడుపుతున్న రామ వరాహభట్ల ముందు ఉన్న డీప్ కర్వ్ ను గుర్తించకపోవడంతో, కారు పక్కకు దూసుకెళ్లింది. దీంతో, అదుపుతప్పిన కారు పల్టీలు కొట్టి, ఆ తర్వాత ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో, కారు ముందు భాగంలో కూర్చున్న రామ, రాజశేఖర్, వెనుక భాగంలో కూర్చున్న అన్వేష్ లు కారులోనే ఇరుక్కుపోయారు. వెనుక భాగంలో కూర్చున్న ప్రశాంత్ డోర్ ఓపెన్ చేయడంతో, కింద పడి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న రాజశేఖర్ ను యూనిర్శిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ సెంటర్ కు తరలించగా... చికిత్స పొందుతూ ఆయన మరణించారు. అన్వేష్, రామలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News