: 9 వేల పరుగుల క్లబ్ లోకి ధోనీ.. హాప్ సెంచరీ పూర్తి చూసిన కోహ్లీ


వన్డేల్లో 9 వేల పరుగుల క్లబ్ లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేరాడు. మొహాలీలో న్యూజిలాండ్ పై జరుగుతున్న మూడో వన్డేలో ఈ రికార్డును ధోనీ నెలకొల్పాడు. వన్డేల్లో 9 వేల పరుగులు పూర్తి చేసిన మూడో వికెట్ కీపర్ గా, భారత్ కు చెందిన ఐదవ ఆటగాడిగా, ఈ రికార్డును ధోనీ సాధించాడు. ధోనీ ఈ రికార్డు నెలకొల్పడంతో అభిమానుల చప్పట్లతో స్టేడియం మార్మోగింది. కాగా, మరోపక్క 50 బంతుల్లో విరాట్ కోహ్లీ 50 పరుగులు పూర్తి చేశాడు. 20.4 ఓవర్లు పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి టీమిండియా స్కోరు 111 పరుగులు.

  • Loading...

More Telugu News