: నా విధేయత చూసే నాకు పదవులిచ్చారు: ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప
‘నా విధేయత చూసే సీఎం చంద్రబాబునాయుడు నాకు పదవులిచ్చారు’ అని ఏపీ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నన్ను చూసిన వాళ్లంతా మెతక అంటారు. కానీ, నా పనితీరు గట్టిగా ఉంటుంది. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గించేందుకు కృషి చేస్తున్నాను. నాకు కేటాయించిన శాఖను నేను పట్టించుకోవడం లేదనేది అబద్ధం. నా పేరు చెప్పుకుని దందాలు చేసుకునేవాళ్లను జైలుకు పంపాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పోలీస్ స్టేషన్లు అప్పగించామనేది అవాస్తవం’ అని అన్నారు. తన తండ్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని, ఆయనే తనను టీడీపీలో చేర్చారని ఈ సందర్భంగా నాటి విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు.