: విజయవాడలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు
విజయవాడలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు అయింది. నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ నోట్లను బెంగళూరు నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న దంపతులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, వీళ్లిద్దరూ భార్యాభర్తలమని చెబుతున్నప్పటికీ, పోలీసులు అడిగిన ప్రశ్నలకు, వారు చెబుతున్న సమాధానాలకు పొంతన లేకపోవడం గమనార్హం. అసలు, వాళ్లిద్దరూ భార్యాభర్తలా? కాదా? అనే అనే విషయంపైన, ఈ దొంగనోట్లను విజయవాడలో ఎవరికి అందజేస్తున్నారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నట్లు విజయవాడ పోలీసులు పేర్కొన్నారు.