: జాగ్రత్త... భారత్ తో మ్యాచ్ వేళ పాక్ ఆటగాళ్లకు పీహెచ్ఎఫ్ సలహా


మలేషియా వేదికగా మరికొన్ని గంటల్లో తమ చిరకాల ప్రత్యర్థి భారత్ తో హాకీలో పోటీ పడనున్న పాకిస్థాన్ జట్టు సభ్యులకు పీహెచ్ఎఫ్ (పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్) సలహాలు, సూచనలు ఇచ్చింది. "రెండు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితి నెలకొని వుందని వారికి గుర్తు చేశాం. మ్యాచ్ ముందు లేదా మ్యాచ్ తరువాత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాం. ఏ విధమైన నోటి దురుసుతనం వద్దని చెప్పాం" అని పీహెచ్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డిసెంబర్ 2014 లో చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో భారత్, పాక్ మధ్య జరిగిన గొడవలను గుర్తు చేసి, మరోసారి భారత హాకీ బోర్డుతో అటువంటి వివాదాలు రాకుండా చూసుకోవాలని జట్టు సభ్యులకు చెప్పినట్టు వివరించారు. కాగా, ఈ మ్యాచ్ లో జట్టు కెప్టెన్, సీనియర్ అటగాడు మొహమ్మద్ ఇమ్రాన్ లేకుండానే పాక్ బరిలోకి దిగుతోంది. ఆయన తన పాస్ పోర్టుకు వీసా నిమిత్తం యూకే కాన్సులేట్ కు పంపగా, మలేషియాకు వెళ్లాల్సిన సమయం దగ్గరైనా అది వెనక్కు రాకపోవడంతో ఇమ్రాన్ జట్టుతో కలవలేకపోయాడు.

  • Loading...

More Telugu News