: ప్రభాస్ జన్మదిన వేడుకల్లో విషాదం... అభిమాని మృతి


తన అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలను వైభవంగా జరుపుకోవాలని ఓ యువకుడు చేసిన ప్రయత్నం అతని కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హీరో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల వేళ ప్రశాంత్ (19) అనే వీరాభిమాని కరెంట్ షాక్ తో మరణించిన ఘటన నిజామాబాద్ లో జరిగింది. వేడుకల సందర్భంగా ఓ ప్లెక్సీని కడుతున్న ప్రశాంత్, ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను తాకాడు. దీంతో షాక్ కొట్టి పైనుంచి కిందపడిన ప్రశాంత్, తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన గురించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని తరలించి, కేసు నమోదు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News