: అత్యంత కఠినమైన కాంబ్రియన్ ప్యాట్రోల్ పోటీల్లో భారత సైన్యానికి స్వర్ణ పతకం
అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సైన్యం పోటీల్లో భారత్ సత్తా చాటింది. బ్రిటన్ నిర్వహించిన అత్యంత కఠినమైన కాంబ్రియన్ ప్యాట్రోల్ పోటీల్లో 8 గూర్ఖా రైఫిల్స్ రెండో బెటాలియన్ కు చెందిన 8 మంది సభ్యుల బృందానికి స్వర్ణ పతకం లభించింది. వేల్స్ లోని ఎగుడు దిగుడు రాళ్లతో ప్రమాదకరమైన కాంబ్రియన్ పర్వతాల్లో ఈ పోటీని నిర్వహించగా, యుద్ధ నైపుణ్యం, డ్రిల్స్, ప్రథమ చికిత్స, విమానాలు, వాహనాలను గుర్తించడం, దారిలో ఉంచిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడం, యుద్ధ ఖైదీల నిర్వహణ, రేడియో కమ్యూనికేషన్ నైపుణ్యం, హెలికాప్టర్ డ్రిల్స్ తదితరాల్లో పాల్గొంటూ 55 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వుంటుంది. పలు దేశాల సైనిక బృందాలు ఈ పోటీల్లో పాల్గొనగా, భారత్ విజయం సాధించడం మన సైనిక సామర్థ్యానికి నిదర్శనం.