: భూకంపం పగుళ్లు శాశ్వతంగా మిగిలిపోతాయ్
భూకంపం వలన భూమికి ఏర్పడే పగుళ్లు కాలక్రమంలో భూమి అంతర్భాగంలో జరిగే మార్పు చేర్పుల్లో తిరిగి కలిసిపోతాయని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు అనుకుంటుండేవారు. అయితే అలా జరగదని, ఈ పగుళ్లు శాశ్వతంగా మిగిలిపోతాయని, వాటితో భూమండలానికి ముప్పేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషయం తన తాజా అధ్యయనంలో బయటపడినట్లు రిచర్డ్ అల్మెన్డిరగర్ అనే శాస్త్రవేత్త చెప్పారు.
అయితే రిక్టర్ స్కేలు మీద 7 కంటె ఎక్కువ తీవ్రత ఉన్నట్లుగా నమోదు అయ్యే భూకంపాలు మాత్రమే.. భూమి మీద గరిష్ట ప్రభావాన్ని చూపిస్తాయిట. వాటివల్ల జరిగే నష్టం శాశ్వతంగా మిగిలిపోతుందిట. చిలీ భూకంపంలో శాస్త్రవేత్తల అధ్యయనాలు దీన్ని తేల్చాయి. అదే సమయంలో శాన్ఫ్రాన్సిస్కోలో ఒకప్పుడు వాటిల్లిన భూకంపం చిన్నదైనందున 80శాతానికి పైగా నాశనం జరిగినా.. కొన్నాళ్లకు భూమి పొరలు కలిసి పోయి యథాస్థానానికి రావడం జీపీఎస్ ద్వారా కూడా ధ్రువపడింది.