: పాక్ దళాల స్నిప్పర్ ఎటాక్... బీఎస్ఎఫ్ జవాను మృతి


పాకిస్థాన్ సైనికులు జరిపిన స్నిప్పర్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీఎస్ఎఫ్ జవాను గుర్మాన్ సింగ్ మృతి చెందాడు. 26 ఏళ్ల గుర్మాన్ ఖతువా జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా, శుక్రవారం నాడు పాక్ దళాలు కాల్పులు జరుపగా గుర్నామ్ గాయపడ్డ సంగతి తెలిసిందే. గుర్నామ్ ను జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేసినా, ఫలితం లేకపోయిందని సైనికాధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈ స్నిప్పర్ దాడి భారత్, పాక్ సైన్యం మధ్య హీరానగర్ సెక్టారులో ఎదురుకాల్పులకు దారి తీయగా, ఏడుగురు పాకిస్థాన్ రేంజర్లు మరణించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పాక్ మాత్రం తమవారెవరూ చనిపోలేదని ప్రకటించింది.

  • Loading...

More Telugu News