: దొంగ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను చూసి షాక్ తిన్న పోలీసులు


తమిళనాడులో ఓ దొంగను, అతనికి సహకరిస్తున్న బ్రోకర్ ను పట్టుకున్న పోలీసులు వారిద్దరూ కలసి దోచుకున్న సరకును చూసి షాక్ తిన్నారు. చైన్నైలోని పలవక్కమ్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆ ప్రాంతంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ప్రవీణ్‌ కుమార్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చేపట్టిన విచారణలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను కత్తితో బెదిరించి, వారి నుంచి ఫోన్లు, డబ్బును దోచుకుంటానని, అలా దోచుకున్న ఫోన్లను హనుమాన్‌ రామ్‌ అనే బ్రోకర్‌ కు అమ్ముతానని తెలిపాడు. దీంతో పోలీసులు హనుమాన్‌ రామ్‌ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి నివాసాల్లో తనిఖీలు చేసిన పోలీసులు, 2,240 మొబైల్‌ ఫోన్లు, 10 ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అన్ని ఫోన్లను చూసిన పోలీసులు షాక్ తిన్నారు.

  • Loading...

More Telugu News