: ఇరాక్ లోని కిర్కుక్ లో భీకరపోరు.. ఐఎస్ఐఎస్ కు భారీ నష్టం


ఇరాక్ నుంచి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పలాయనం చిత్తగిస్తున్నారు. సద్దాం హుస్సేన్ హత్య అనంతరం చోటుచేసుకున్న అంతర్యుద్ధాన్ని ఆసరా చేసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పలు నగరాలను స్వాధీనం చేసుకుని, సమాంతర పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాకీ దళాలతో కూడిన సంకీర్ణసేనలు ఐఎస్ఐఎస్ పై యుద్ధం ప్రకటించాయి. ఒక్కో నగరాన్ని ఐఎస్ఐఎస్ నుంచి స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కిర్కుక్ నగరంలో ఉగ్రవాదులు, సంకీర్ణ సేనలకు మధ్య భీకరమైన పోరు జరుగుతోంది. సంకీర్ణసేనలు ఉగ్రవాద దళాలపై విరుచుకుపడ్డాయి. ఇరాక్ కు చెందిన కౌంటర్ టెర్రరిజమ్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక దళాలు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులపై మెరుపుదాడులు చేసి 48 మందిని హతమార్చాయి. మెజారిటీ సభ్యులను సంకీర్ణసేనలు హతమార్చగా, మరికొంతమంది ఉగ్రవాదులు వారిని వారే పేల్చేసుకున్నారు. దీంతో మిగిలిన ఉగ్రవాదులు పలాయనం చిత్తగిస్తున్నారని సమాచారం. కాగా, మోసూల్ నగరంలో కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై సంకీర్ణసేనలు విరుచుకుపడి భారీ సంఖ్యలో హతమార్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News