: వైజాగ్ వన్డేకు అందుబాటులో 12 వేల టికెట్లు
ఈ నెల 29న వైజాగ్ లోని ఏసీఏ-వీడీసీఏ డాక్టర్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న వన్డేకు 12 వేల టికెట్లు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ నివాస్ తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ఈ టికెట్లను ఈ నెల 25 నుంచి ఈసేవా కేంద్రాల్లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. నాలుగు విభాగాలుగా టికెట్లను అందుబాటులో ఉంచామని, 400 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు, 5,000 రూపాయలు విభాగాల్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.