: తన ట్వీట్ తో అభిమానులను కంగారుపెట్టిన బాలీవుడ్ భామ అలియా భట్
కేవలం 23 ఏళ్లకే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న అలియా భట్, తన ఫస్ట్ నైట్ తన తల్లిదండ్రులకే అంకితమని చెప్పింది. ఫస్ట్ నైట్ ఎవరైనా తల్లిదండ్రులకు అంకితమిస్తారా? అన్న అనుమానం వచ్చిందా? అయితే అలియా భట్ ఏం చెప్పిందో సరిగ్గా వినాల్సిందే. ఈ మధ్యే ఈ ముద్దుగుమ్మ ముంబైలో సొంత ఇల్లు కొనుక్కొంది. ఈ ఇంట్లో తన సోదరి షహీన్ తో పాటు ఉండాలనుకుంటోంది. ఇంత వరకు తల్లిదండ్రులతో కలిసి ఉన్న అలియా భట్ ఇప్పుడు కొత్తింట్లో సోదరితో పాటు ఉండనుంది. త్వరలో ఆ ఇంట్లో గృహప్రవేశం చేయనున్న అలియా...తను ముచ్చటపడి కట్టించుకున్న ఇంట్లో తొలి రాత్రిని తన తల్లిదండ్రులకు డెడికేట్ చేస్తున్నానని తెలిపింది. తొలి రోజు స్నేహితులందర్నీ పిలిచి మంచి పార్టీ ఇవ్వనున్నానని తెలిపింది. ఈ మేరకు 'కొత్తింట్లో ఫస్ట్ నైట్ తన తల్లిదండ్రులకు అంకితం' అని ట్వీట్ చేయడంతో అభిమానులు తప్పుగా అర్ధం చేసుకుని, తరువాత వాస్తవం తెలుసుకుని నాలుక్కరుచుకుంటున్నారు.