: విశాఖలో అక్రమంగా తరలిస్తున్న 250 తాబేళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
పెద్ద మొత్తంలో అక్రమంగా తాబేళ్లను తరలిస్తోన్న నలుగురు వ్యక్తులను విశాఖపట్నం జీకేవీధి పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. సుమారు 250 తాబేళ్లను వారు బస్తాల్లో నింపి తరలించాలని చూశారని పేర్కొన్నారు. తాబేళ్లను ఆర్టీసీ బస్సులో నర్సీపట్నం తీసుకెళుతుండగా జీకేవీధి మండలం ముల్లుమెట్ట గ్రామం వద్ద అటవీశాఖ అధికారులు బస్సును సోదా చేశారు. దీంతో వారి అక్రమ తరలింపు వ్యవహారం బయటపడింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను జలాశయాల్లో వదిలిలేయనున్నట్లు పేర్కొన్నారు.