: నాపై భూకబ్జా ఆరోపణలు అసత్యం.. నా భూమే ఆక్రమణకు గురైంది: ఎమ్మెల్యే కాకాని


త‌న‌పై వ‌స్తోన్న భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌ను ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి ఖండించారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... భూకబ్జా విష‌యంలో త‌న‌పై వ‌స్తోన్న ఆరోపణలు స‌త్య‌దూర‌మ‌ని పేర్కొన్నారు. త‌న భార్య‌కు తన అత్త‌మామ‌లే ఆరు ఎక‌రాల‌ భూమి ఇచ్చారని ఆయ‌న చెప్పారు. తాము ప్ర‌స్తుతం ఆ భూమిని కౌలుకు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. దళితుల భూములతో కలిపి కంచె వేసిన విషయం గురించి త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. అంతేగాక‌, తమ భూమే కొంత మేర‌కు క‌బ్జాకు గురైందని అన్నారు. ప‌లువురు తనపై అస‌త్య‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News