: కేసీఆర్ పై సినిమా కోసం కేటీఆర్ తో వర్మ చర్చలు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్రతో సినిమాను నిర్మించబోతున్నట్టు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా పేరు 'ఆర్ సీ కే' అని కూడా అనౌన్స్ చేశాడు. కేసీఆర్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నామంటూ మధుర శ్రీధర్ ప్రకటించిన 24 గంటల్లోపే... తాను కూడా కేసీఆర్ సినిమా తీయబోతున్నానంటూ వర్మ ప్రకటించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అంతేకాదు, తాను ఈ సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నానో కూడా తాజాగా ట్విట్టర్ ద్వారా వర్మ వెల్లడించాడు. కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ తో సుదీర్ఘమైన చర్చలు జరిపిన మీదటే, కేసీఆర్ పై సినిమా తీయడం జరుగుతుందని ఈ రోజు ఆయన ట్వీట్ చేశాడు.