: ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన భద్రతాదళాలు
పాకిస్థాన్ కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఇద్దర్ని భారత భద్రతాదళాలు అరెస్ట్ చేశాయి. జమ్ముకాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో వీరిని అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి ఒక ఏకే47, ఓ పిస్టల్ తో పాటు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి తోడు, అంతర్జాతీయ సరిహద్దులోని ఆర్ఎస్ పుర సెక్టార్ లో పాక్ కాల్పులను భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో, సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైనికాధికారులు హెచ్చరించారు.