: హిల్లరీని ఒబామా భార్య తిట్టిపోసిన వైనాన్ని తిరగదోడిన ట్రంప్


అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. అయితే, ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో, రేసులో కొంత వెనుకబడి పోయాడని విశ్లేషకులు భావిస్తున్న ట్రంప్... తాజాగా హిల్లరీకి సంబంధించి గతంలో జరిగిన ఓ సంఘటనను వెలికి తీశారు. 2007లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వం కోసం ఒబామా, హిల్లరీలు పోటీ పడ్డారు. ఆ సందర్భంలో, ఒబామా తరపున ఆయన భార్య మిషెల్లీ కూడా ప్రచారం చేశారు. ఇంటిని కూడా చక్కదిద్దుకోలేని హిల్లరీ క్లింటన్... అమెరికాను సరిగా పాలించగలుగుతుందా? అంటూ అప్పట్లో మిషెల్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, నార్త్ కరోలినాలోని ఫ్లెచర్ పట్టణంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్... హిల్లరీని మిషెల్లీ దుయ్యబట్టిన అంశాన్ని లేవనెత్తారు. ప్రస్తుత పాలకులంతా పిల్లకాకులని, పరాజితులని ట్రంప్ దుయ్యబట్టారు. బిల్ క్లింటన్ అక్రమ సంబంధాల నేపథ్యంలోనే 2017లో హిల్లరీని మిషెల్లీ తిట్టిపోసిందని... ఇప్పుడు తనను మిషెల్లీ విమర్శిస్తోందని అన్నారు. మనల్ని పాలిస్తున్న వారి బతుకులు ఇలా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News