: నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. మార‌ణాయుధాల‌తో త‌ల‌బ‌డ్డ ఇరు వర్గాలు.. ముగ్గురి మృతి


నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పాపన ముసిలిపాలెంలో ఈ రోజు తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. రెండు వ‌ర్గాలు మార‌ణాయుధాల‌తో త‌ల‌బ‌డ్డాయి. ఈ గొడ‌వ‌లో ముగ్గురు మృతి చెందారు. మ‌రి కొంత‌మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం వారు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహ‌రించారు. పొలం విషయంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెల‌రేగింద‌ని పోలీసులు తెలిపారు. మృతులను తానం సుబ్బారెడ్డి, తానం మ‌హేంద‌ర్‌రెడ్డి, కొండ్రెడ్డి సుబ్బారెడ్డిగా పేర్కొన్నారు. నిందితులు శ్రీ‌నివాస్‌రెడ్డి, వెంక‌టేశ్వ‌ర్లు పోలీసులకి లొంగిపోయారు.

  • Loading...

More Telugu News