: లాభాల్లో చిన్న కంపెనీలు, నష్టాల్లో దిగ్గజాలు!


సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచికలు నష్టాల్లోకి జారిపోగా, చిన్న, మధ్యతరహా కంపెనీలు లాభాలను పండించుకున్నాయి. ఒక దశలో 150 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ తిరిగి కాస్తంత కోలుకుని నష్ట శాతాన్ని తగ్గించుకుంది. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 52.66 పాయింట్లు పడిపోయి 0.19 శాతం నష్టంతో 28,077.18 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 6.35 పాయింట్లు పడిపోయి 0.07 శాతం నష్టంతో 8,693.05 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.31 శాతం, స్మాల్ కాప్ 0.10 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 27 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. ఐడియా, టెక్ మహీంద్రా, టాటా పవర్, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, సిప్లా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 3,021 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,459 కంపెనీలు లాభాలను, 1,317 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,14,08,478 కోట్లుగా నమోదైంది.

  • Loading...

More Telugu News