: దీపావళికి బంపర్ ఆఫర్ ను ప్రకటించిన వొడాఫోన్


దీపావళి సందర్భంగా తన వినియోగదారులకు వొడాఫోన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి నుంచి రోమింగ్ ఛార్జీలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. దీంతో, ఏ రాష్ట్ర వినియోగదారులైనా దేశ వ్యాప్తంగా ఇన్ కమింగ్ కాల్స్ ను ఉచితంగా రిసీవ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా వొడాఫోన్ కమర్షియల్ డైరెక్టర్ సందీప్ కటారియా మాట్లాడుతూ, తమ వినియోగదారులు ఇకపై రోమింగ్ ఛార్జీలు పడతాయనే బాధ లేకుండా, స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చని తెలిపారు. ఈ కొత్త నిర్ణయంతో తమ రెండు కోట్ల మంది వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రిలయన్స్ జియోతో పోటీ కారణంగానే వొడాఫోన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News