: కృష్ణపట్నంలో 1500 కోట్లతో కొత్త పరిశ్రమ
నవ్యాంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నంలో రూ. 1500 కోట్ల పెట్టుబడితో కొత్త ఎరువుల కర్మాగారం రాబోతోంది. ఈ ఫ్యాక్టరీని క్రిబ్ కో, ఓసీపీ (మొరాకో)లు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. దీనికి సంబంధించిన ఒప్పందాలు ఈ రోజు ఢిల్లీలోని ఏపీ భవన్ లో జరిగాయి. కేంద్రమంత్రి మన్షూద్ మాండవీయా, ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 2019 ఏప్రిల్ నాటికి ఈ ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని క్రిబ్ కో ఎండీ సాంబశివరావు తెలిపారు. ఇప్పటికే ఓడరేవు, పవర్ ప్లాంట్ లను కలిగి ఉన్న నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నానికి ఎరువుల కర్మాగారం కూడా వస్తుండటంతో... ఆ ప్రాంతం పారిశ్రామికంగా పురోగమించనుంది.