: భార్య ఆత్మహత్య కేసులో కబడ్డీ ప్లేయర్ రోహిత్ అరెస్ట్


భార్య లలిత ఆత్మహత్య కేసులో జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్ రోహిత్ చిల్లార్ ను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. కట్నం కోసం తన భర్త, అత్తమామలు వేధించారని, అందుకే, ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ లలిత తన సూసైడ్ నోట్ లో పేర్కొంది. కాగా, తన భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలపై రోహిత్ పై కేసు నమోదు చేశారు. ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, గత సోమవారం రాత్రి ఢిల్లీలోని తమ అపార్ట్ మెంట్ లో లలిత ఉరివేసుకుంది. రెండుగంటల ఆడియో టేపులతో పాటు, ఒక సూసైడ్ నోట్ ను కూడా సంఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News