: కేసీఆర్ పై రామ్ గోపాల్ వర్మ సినిమా.. 'ఆర్ సీ కే'!


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సెన్సేషనల్ సినిమాను ప్రకటించాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నట్టు తెలిపాడు. సినిమా పేరు 'ఆర్ సీ కే'. ఇది కేసీఆర్ కు రివర్స్ అన్నమాట. బయటకు కనిపించే కేసీఆర్ ను కాకుండా, అతని ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తానని వర్మ ట్వీట్ చేశాడు. ఇదే సమయంలో కేసీఆర్ కు ఓ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. తెలంగాణ బ్రూస్ లీకి దీపికా పదుకొనే అందం కలిపితే కేసీఆర్ అని అన్నాడు. 'వంగవీటి' సినిమా అనౌన్స్ మెంట్ సమయంలో ఇదే తన చివరి సినిమా అని చెప్పిన వర్మ... ఇప్పుడు ఏకంగా కేసీఆర్ సినిమా తీస్తానంటూ సంచలనానికి తెరతీశాడు.

  • Loading...

More Telugu News