: కొత్త ఐఫోన్ 7పై స్నాప్డీల్లో బంపర్ ఆఫర్!


కొత్త ఆపిల్ ఐఫోన్7పై రూ.7,000ల డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ ప్ర‌క‌టించింది. పండుగ సీజ‌న్‌లో భాగంగా ఎన్నో ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తోన్న స‌దరు సంస్థ అన్బాక్స్ సేల్ ఆఫర్లో చివరి రోజు కొత్త ఆపిల్ ఐఫోన్ 7పై ఈ స్పెషల్ డిస్కౌంట్‌ను తమ క‌స్ట‌మ‌ర్ల ముందు ఉంచింది. అయితే, ఈ ఆఫ‌ర్‌ను పొందాలంటే యస్ బ్యాంకు, ఎస్బీఐ కార్డు హోల్డర్లయి ఉండాల‌ని తెలిపింది. ఈ రోజు స్టాక్స్ అయిపోయేంత వరకు ఈ ఆఫర్ ను త‌మ క‌స్ట‌మ‌ర్లు పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. ఐఫోన్7 తో పాటు ఐఫోన్7 ప్లస్ కి కూడా ఆఫర్ ఉన్నట్లు పేర్కొంది. తాజా ఆఫ‌ర్‌లో భాగంగా త‌మ నివియోదారులు ఐఫోన్‌7 కోసం ఇతర మోడల్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేసుకునే అవ‌కాశాన్ని కూడా ప్ర‌క‌టించింది. ఈ విధానం ద్వారా ఐఫోన్7ను కొనుగోలు చేసే వారికి రూ.20వేల వరకు ధర తగ్గిస్తున్న‌ట్లు తెలిపింది. ఎక్స్చేంజ్ చేసుకునే ఫోన్ల‌ మోడల్‌ను బట్టి ఈ ఆఫర్ ఉంటుంద‌ని పేర్కొంది. స్నాప్ డీల్ అన్బాక్స్ దివాళి సేల్ ఆఫ‌ర్‌ కింద కొన్ని రోజుల క్రితం ఇటువంటి ఆఫర్‌నే ప్ర‌క‌టించింది. అందులో అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్పై ఫ్లాట్పై రూ.10,000ల డిస్కౌంట్‌ను అందిస్తున్న‌ట్లు పేర్కొంది. కానీ, ప‌లుకార‌ణాల‌తో ఆ ఆఫర్ను స్నాప్డీల్ వెనక్కి తీసుకొంది. దీంతో తాజాగా మరోసారి ఐఫోన్ 7 ఆఫర్ను తీసుకొచ్చింది. మ‌రోవైపు త‌మ వ‌ద్ద ఉత్ప‌త్తులు కొనుగోలు చేయాల‌నుకుంటున్న‌ హెచ్డీఎఫ్సీ కార్డు హోల్డర్ల‌కు 10 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. ఎక్స్చేంజ్ ఆఫర్లను, ఆపిల్ ఐఫోన్ 6ఎస్, శాంసంగ్ గెలాక్సీ జే3 వంటి ప‌లు స్మార్ట్ఫోన్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది.

  • Loading...

More Telugu News