: జయశంకర్ జిల్లా ములుగులో దారుణం.. వేధింపులు తాళలేక కిరోసిన్ పోసుకొని, నిప్పంటించుకుని యువతి ఆత్మహత్య
జయశంకర్ జిల్లా ములుగులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వేధింపులు తాళలేక కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఏడాదిగా రమ్య అనే యువతిని అమర్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేస్తున్నాడు. అమర్‌కి ఇప్పటికే వివాహం జరిగింది. అయినా రమ్య వెంట పడుతున్నాడు. దీంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని, నిప్పంటించుకొని రమ్య ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమ్య మృతి చెందింది. తన చావుకు అమర్ కారణమని, తనను అతడు వేధిస్తున్నాడని మరణవాంగ్మూలంలో రమ్య పేర్కొంది.