: స్వరూపానంద స్వామి వ్యాఖ్యలపై మండిపడుతున్న సాయిబాబా భక్తులు.. దిల్‌సుఖ్ నగర్‌లో ర్యాలీ
ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద మరోసారి షిరిడీ సాయినాథుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం పట్ల సాయి భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయం సమీపంలో ఈ రోజు స్వరూపానందకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. స్వరూపానంద తుగ్లక్ లా వ్యాఖ్యలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. స్వరూపానంద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్వరూపానందకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సాయిపై అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. చాంద్‌మియా, దేవుడు కాదు అంటూ సాయిబాబాపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.