: పోలీసు అధికారిని కొట్టిన కేంద్ర మంత్రి...విమర్శలు


పోలీసు అధికారిపై చేయి చేసుకుని ప్రముఖ గాయకుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఇబ్బందుల్లో పడ్డారు. పశ్చిమబెంగాల్ లోని సొంత నియోజకవర్గానికి వెళ్తున్న క్రమంలో ఆయనను తృణమూల్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమయంలో పులువురు ఆయనపై, ఆయన కారుపై రాళ్లదాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆయన తనవద్దకు వచ్చిన వచ్చిన పోలీసు అధికారి తలపై కొట్టారు. దానికి ఆయన టోపీ ఎగిరిపోయింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో బాబుల్ సుప్రియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబుల్ సుప్రియోపై రాళ్ల దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News