: ప్రజా సమస్యలను తెలియ‌జేస్తోన్న మహిళా జర్నలిస్టును కొట్టిన పాక్ పోలీస్


ప్రజా సమస్యలను తెలియ‌జేస్తూ లైవ్ రిపోర్టు చేసే మహిళా జర్నలిస్టుపై పాకిస్థాన్ ఫ్రాంటియర్ కానిస్టేబులరీ(ఎఫ్సీ) గార్డు దాడి చేసిన ఘ‌ట‌న క‌రాచీలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న స‌మ‌యంలో తీసిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైరల్గా మారింది. ఆయ‌న‌ తీరుపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కరాచీలోని నాద్రా రిజిస్ట్రేషన్ కార్యాల‌యంలో స్థానికులు ఎదుర్కొంటున్న‌ సమస్యలపై లైవ్ రిపోర్టు చేయడానికి పాకిస్థాన్లోని కే-21 ఛానల్లో ప‌నిచేస్తోన్న‌ సైమా కన్వల్ వ‌చ్చింది. ఆ కార్యాల‌యంలో ఎఫ్సీ గార్డు ఆమెను అడ్డుకుని, కొట్టాడు. ఈ మొత్తం స‌న్నివేశం కెమెరాకు చిక్కింది. దురుసుగా ప్ర‌వ‌ర్తించిన ఎఫ్సీ పోలీస్ గార్డుపై గుల్బహార్ పోలీసు స్టేషన్లో కేసు న‌మోదు చేశారు. దాడి చేసిన వ్య‌క్తిని తమకు కస్టడీకి ఇప్పించాలని ఎఫ్సీ అధికారుల‌ను పోలీసులు కోరారు. అయితే, స‌ద‌రు రిపోర్ట‌ర్‌కు వ్యతిరేకంగా కూడా ఓ ఎఫ్ఐఆర్ను నాద్రా అధికారులు నమోదు చేసినట్టు అక్క‌డి అధికారులు పేర్కొన్నారు. అధికారిక పనిలో ఆమె అడ్డుత‌గులుతోంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఎంఎన్ఏ పాకిస్థాన్ సల్మాన్ ముజాహిద్ బ్లాచ్ ఈ అంశంపై స్పందిస్తూ.. తన కూతురు లాంటి మహిళా జర్నలిస్టుపై దాడి చేసిన ఆ గార్డుపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. స‌ద‌రు పోలీస్ గార్డుపై చ‌ర్య‌లు త‌ప్ప‌కుండా తీసుకోవాలంటూ సోష‌ల్‌మీడియాలో డిమాండ్లు వ‌స్తున్నాయి.

  • Loading...

More Telugu News