: ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి


తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్, కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఆలిండియా హాకీ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. ఆలిండియా హాకీ ఫెడరేషన్ డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న రేవంత్ రెడ్డిని ఢిల్లీలో జరిగిన హాకీ ఫెడరేషన్‌ సమావేశంలో అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దక్షిణాదిలో పెద్దగా ఆదరణకు నోచుకోని హాకీ క్రీడకు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అభినందనీయం అంటూ రేవంత్‌ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్బంగా పలువురు టీడీపీ నేతలు, క్రీడాకారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News