: విజయవాడలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
కృష్ణా జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హోం మంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పరేడ్ నిర్వహించారు. పోలీసుల నుంచి గవర్నర్, సీఎం, హోం మంత్రి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా విధుల్లో 418 మంది వివిధ స్థాయుల పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 14 మంది పోలీసులు విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని వారు పేర్కొన్నారు. వారి సేవలు అమోఘమని, ప్రజల హక్కుల పరిరక్షణలో వారు ప్రాణాలు పణంగా పెట్టారని పేర్కొన్నారు.