: 100 కోట్లతో బంగళా కొనుగోలు చేసిన లాయర్ వద్ద 125 కోట్ల అక్రమాస్తులు?


100 కోట్లతో బంగళా కొనుగోలు చేసిన ఓ లాయర్ వద్ద 125 కోట్ల రూపాయల అప్రకటిత ఆస్తులు బట్టబయలు కావడం ఆదాయపుపన్ను శాఖాధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. అప్రకటిత ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ప్రభుత్వం విధించిన గడువు గత నెల 30తో ముగియడంతో అక్రమ ఆదాయాన్ని వెల్లడించని వారిపై ఆదాయపన్ను శాఖ దృష్టిపెట్టింది. దీంతో ఢిల్లీలో 100 కోట్ల రూపాయలతో బంగళా కొనుగోలు చేసిన ఓ ప్రముఖ న్యాయవాది అక్రమాస్తులపై ఐటీశాఖ కన్నేసింది. దీంతో ఆయన నివాసంపై దాడి చేసి 125 కోట్ల రూపాయల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించింది. దీంతో ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకుంది. అనంతరం భారీగా అప్రకటిత ఆదాయం కలిగి ఉన్నట్లు భావిస్తున్న మరింతమంది ప్రముఖులపై ఆదాయపు శాఖ దృష్టి సారించింది. ప్రధానంగా విమానయానం, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఐటీ, కస్టమ్స్‌ రంగాల్లో లాబీయిస్టుల ఆదాయాలపై ఆదాయపుపన్ను శాఖ దృష్టిపెట్టింది. ఇప్పటికే రక్షణరంగంలో వ్యవహారాలను చక్కదిద్దే సంజయ్‌ భండారీ, కార్పొరేట్‌ వ్యవహారాల సలహాదారుడు దీపక్‌ తల్వార్‌ వంటివారి నివాసాలపై సోదాలు చేసింది. కాగా, ఆ లాయర్ ఎవరు? అన్న విషయాన్ని వెల్లడించకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News