: కేవలం 14 సెకన్లలోనే విడాకులు మంజూరు చేసిన లండన్ ఫ్యామిలీ కోర్టు
ప్రముఖ పాప్ సింగర్ షెరిల్ ఫెర్మాండెజ్, జీన్ బెర్నాడ్ దంపతులకు కేవలం 14 సెకన్లలోనే విడాకులు మంజూరు చేస్తూ లండన్ ఫ్యామిలీ కోర్టు తీర్పు నిచ్చింది. ఇరుపక్షాల వాదనలను కేవలం 14 సెకన్ల సమయంలో విన్న కోర్టు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. కాగా, ‘ద గర్ల్స్ అలౌడ్’ పాప్ ఆల్బంతో ఫేమస్ అయిన షెరిల్, ఫ్రాన్స్ కు చెందిన రెస్టారెంట్ యజమాని జీన్ బెర్నాడ్ వర్సిస్ ను రెండున్నరేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకుంది. అయితే, భర్త అసభ్య ప్రవర్తన కారణంగా తాను మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యానని, బరువు కూడా తగ్గిపోయానని, విడాకులు మంజూరు చేయాలని షెరిల్ ఫెర్మాండెజ్ కోర్టుకు విన్నవించుకుంది.