: ముస్లిం మహిళలే పోరాడుతున్నారు... కాంగ్రెస్ పాత రాతియుగంలో ఉంది: దత్తాత్రేయ


కాంగ్రెస్ నాయకులపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. వారంతా ఇంకా పాత రాతియుగంలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. భారత సైనికులు జరిపిన సర్జికల్ దాడులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి పౌరస్మృతిపై కూడా కాంగ్రెస్ భిన్న వైఖరిని అవలంబిస్తోందని అన్నారు. ముస్లిం మహిళలు కూడా ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తున్నారని... దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని తెలిపారు. రైతుల కోసం ఎన్డీఏ సర్కారు ఎంతో చేస్తోందని, ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకుంటోందని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News