: తెలంగాణ రెవెన్యూ శాఖలో కొన్ని పోస్టుల పేర్లు మార్పు
రెవెన్యూ శాఖలోని కొన్ని పోస్టులు, కార్యాలయాల పేర్లను మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి వివరాలు... 1. మండల్ రెవెన్యూ కార్యాలయం ఇకపై తహశీల్ ఆఫీస్ లేదా తహశీల్ కార్యాలయంగా మారుతుంది. 2. ఎమ్మార్వో (మండల్ రెవెన్యూ ఆఫీసర్) ఇకపై తహశీల్దార్ గా మారనున్నారు. 3. డిప్యూటీ తహశీల్దార్లను ఇకపై నాయబ్ తహశీల్దార్లుగా పిలవాలని ప్రభుత్వం పేర్కొంది. 4. రెవెన్యూ ఇన్ స్పెక్టర్లను ఇకపై గిర్దావర్లుగా పేర్కొంటారు.