: హిల్లరీ లాంటి వ్యక్తి కాదు మా నాన్న!: జూనియర్ ట్రంప్
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తన బిజినెస్ కెరీర్ ను పక్కన పెట్టి, తన స్థాయిని తగ్గించుకున్నారని కొడుకు జూనియర్ ట్రంప్ పేర్కొన్నారు. చివరిది, మూడోది అయిన ప్రెసిడెన్షియల్ డిబేట్ లాస్ వెగాస్ లో నిన్న రాత్రి జరిగింది. అనంతరం ఫాక్స్ న్యూస్ తో ట్రంప్ జూనియర్ మాట్లాడుతూ, ‘అమెరికా పలుకుబడిని ఉపయోగించుకుని ధనవంతురాలైన రాజకీయ నాయకురాలు హిల్లరీ క్లింటన్ లాంటి వ్యక్తి కాదు నా తండ్రి. అమెరికన్లు అందరికీ, అన్ని జాతుల వారికి, ఎటువంటి సామాజిక నేపథ్యం ఉన్నవారికైనా వ్యాపార రంగంలో సమాన అవకాశాలు కల్పించేందుకు నా తండ్రి కృషి చేశారు’ అని జూనియర్ ట్రంప్ పేర్కొన్నారు.