: పార్టీ మారిన వెంటనే రాహుల్ పై నిప్పులు చెరిగిన రీటా బహుగుణ


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీ మారిన రీటా బహుగుణ జోషి ఆ వెంటనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. అమిత్ షా పక్కన బీజేపీ కండువా ధరించి కూర్చుని మీడియా సమావేశంలో మాట్లాడిన రీటా, సర్జికల్ దాడుల తరువాత రాహుల్ గాంధీ విమర్శలకు చాలా బాధపడినట్టు తెలిపారు. బీజేపీ సైనికుల రక్తంతో రాజకీయాలు చేస్తోందని రాహుల్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టిన ఆమె, రాహుల్ నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించడం లేదని, ఎవరూ ఆయన మాటను వినడం లేదని అన్నారు. పార్టీని ఔట్ సోర్సింగ్ విధానంలో నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటి వ్యక్తిని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించిన రీటా, వచ్చే సంవత్సరం ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూడనుందని అన్నారు.

  • Loading...

More Telugu News