: కడప జువైనెల్ హోమ్‌లో దారుణం.. సహచర బాలుడుని టవల్‌తో ఉరివేసి చంపిన మరోబాలుడు
కడప జువైనెల్ హోమ్‌లో ఈ రోజు దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు బాలుర మధ్య తీవ్ర ఘర్షణ జరిగి ఓ బాలుడి మృతికి కారణమైంది. శిక్షను అనుభవిస్తోన్న ఓ బాలుడు తన సహచర బాలుడితో గొడవపడి టవల్‌తో ఉరివేసి చంపాడు. హత్యకు గురైన బాలుడు చోరీ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ముస్తాఫాగా తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.