: గ్రామ దేవతలను పూజించి కొత్త ఇంట్లోకి ప్రవేశించిన కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం నూతన అధికారిక నివాసంలోకి గృహప్రవేశం చేశారు. మొదట గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్ దంపతులు, ఆపై బంధుమిత్రులతో కలసి నూతన గృహంలోకి ప్రవేశించారు. అనంతరం క్యాంప్ ఆఫీస్ ఆవరణలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త క్యాంప్ ఆఫీసులో సైతం పూజలు చేసి ప్రారంభించారు. గ్రీన్ ల్యాండ్స్ లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేపట్టారు. ఇటీవల ఆ పనులు పూర్తి కావడంతో గృహప్రవేశానికి నేడు మంచి ముహూర్తంగా వేద పండితులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News